Friday, 8 April 2022

BARC Gifts Radiation Detection and Measurement Instruments to GITAM Deemed-to-be-University, Hyderabad


The instruments will allow GITAM faculty to hold workshops and training sessions for radiochemistry students on the measurement of Beta and Gamma radiation

HYDERABAD / April 8, 2022: Indian Association of Nuclear Chemists & Allied Scientists (IANCAS), a scientific body of Bhabha Atomic Research Centre (BARC), Mumbai, has gifted instruments worth Rs 3 lakhs to the Hyderabad campus of GITAM deemed-to-be-university which will enable students to detect and measure radiation and handle radioisotopes safely. The instruments include a Geiger Muller counter for the measurement of Beta radiation and a Gamma Scintillation Detector to measure Gamma radiation.

The BARC scientists were at GITAM Hyderabad to deliver a five-day national workshop on “Radiochemistry and Application of Radioisotopes” for 45 GITAM School of Science faculty members and 20 professors from other universities around the country (4th to 8th April 2022)

Prof. GA Rama Rao, Principal, School of Science, GITAM Deemed-to-be-University, Hyderabad, a retired Scientific Officer from BARC, Mumbai: “We thank you, BARC, for gifting such important equipment to GITAM. This will help us hold practical training sessions for our radiochemistry students to measure Beta and Gamma radiation.”

He added: “Nuclear energy is a vital option for India to meet the ever-increasing demand for power. Though the subject is introduced to students from 10th standard onwards in schools, the teachers themselves, whether at school, college or university, hardly have any hands-on experience of radioactivity. This five-day workshop by IANCAS at our Hyderabad campus provided an opportunity for the participants to experience handling radioisotopes and detecting and measuring radiation in a real-world setting.”

The BARC scientists used the instruments to demonstrate to the participants that daily use products such as soap and salt contain enough naturally occurring K-40 radioisotopes to emit Beta radiation. The air we breathe also includes Beta radiation in the form of Radon gas, which they demonstrated by collecting air samples from the classroom.

The BARC experts taught the basics of radioactivity, decay, radiation, detection and measurement, as well as the application of radioisotopes in areas like chemical sciences, physics, medicine, industry and agriculture. Lab experiments were conducted using radioisotopes like Cobalt-60, Cobalt-67, Thallium-204, Potassium-40 and Cesium-137.

Dr S Kannan from IANCAS, who is an authority on NMR spectroscopy, gave an overall view of the contributions of the Department of Atomic Energy, while Dr YK Bhardwaj, an acclaimed scientist in the field of polymers, spoke about the application of radiation in polymer technology.

Radioisotopes that emit radiation have many applications in the real world, such as sterilization of medical consumables, non-destructive testing of fabricated materials, and irradiation of food products to increase the shelf life of perishable food items like fruits and vegetables.

 

గీతమ్‌ డీమ్డ్-టు-బి-యూనివర్సిటీకి రేడియేషన్‌ డిటెక్షన్ అండ్‌ మెజర్‌మెంట్‌ ఇన్‌స్ట్రూమెంట్స్‌ను బహుమతిగా ఇచ్చిన బార్క్

బీటా, గామా రేడియేషన్‌ కొలిచేందుకు రేడియోకెమిస్ట్రీ విద్యార్థులకు వర్క్‌షాపులు, ట్రైనింగ్‌ సెషన్స్‌ నిర్వహించేందుకు గీతం ఫ్యాకల్టీకి ఉపయోగపడనున్న ఇన్‌స్ట్రూమెంట్స్

హైదరాబాద్ / ఏప్రిల్ 8, 2022: ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC)కి చెందిన సైంటిఫిక్ సంస్థ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ న్యూక్లియర్ కెమిస్ట్స్ & అలైడ్ సైంటిస్ట్స్ (IANCAS) రూ. 3 లక్షల విలువైన పరికరాలను గీతం హైదరాబాద్ క్యాంపస్‌ డీమ్డ్‌ టూ బి యూనివర్సిటీకి బహుమతిగా అందించింది. రేడియేషన్‌ గుర్తించి, కొలిచేందుకు, రేడియో ఐసోటోప్‌లతో సురక్షితంగా పని చేసేందుకు ఈ పరికరాలు సహకరిస్తాయి. వీటిలో బీటా రేడియేషన్‌ను కొలవడానికి గీగర్ ముల్లర్ కౌంటర్, గామా రేడియేషన్‌ను కొలవడానికి గామా స్కింటిలేషన్ డిటెక్టర్ కూడా ఉన్నాయి.

గీతం స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌కు చెందిన 45 మంది ఫ్యాకల్టీ సభ్యులు, దేశంలోని వివిధ విశ్వవిద్యాలయలకు చెందిన 20 మంది ప్రొఫెసర్లకు కోసం “రేడియోకెమిస్ట్రీ అండ్‌ అప్లికేషన్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్” అనే అంశంపై హైదరాబాద్‌ గీతంలో నిర్వహిస్తున్న ఐదు రోజుల జాతీయ వర్క్‌షాప్‌లో పాల్గొనేందుకు బార్క్ శాస్త్రవేత్తలు వచ్చారు.

బార్క్ ముంబయి రిటైర్డ్ సైంటిఫిక్ ఆఫీసర్‌, స్కూల్ ఆఫ్ సైన్స్, గీతం డీమ్డ్-టు-బి-యూనివర్శిటీ, హైదరాబాద్ ప్రిన్సిపాల్ ప్రొ. G.A.రామారావు: “గీతమ్‌కు ఇంత విలువైన పరికరాలు బహుమతిగా ఇచ్చినందుకు బార్క్‌కు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా రేడియోకెమిస్ట్రీ విద్యార్థులు బీటా, గామా రేడియేషన్‌ కొలిచేందుకు ప్రాక్టికల్ ట్రైనింగ్ సెషన్‌లను నిర్వహించడానికి ఇవి మాకు సాయపడతాయి.”

“నిరంతరం పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ తీర్చేందుకు భారతదేశానికి ఒక ముఖ్యమైన ఆప్షన్‌ అణు ఇంధనం. పాఠశాలల్లో 10వ తరగతి నుంచి విద్యార్థులకు ఈ సబ్జెక్ట్‌ పరిచయం చేస్తున్నా పాఠశాలలు, కళాశాలు లేదా విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయులకు రేడియోధార్మికత గురించి ఎలాంటి అనుభవం ఉండదు. మా హైదరాబాద్ క్యాంపస్‌లో IANCAS నిర్వహిస్తున్న ఈ ఐదు రోజుల వర్క్‌షాప్ రేడియో ఐసోటోప్‌లు ఉపయోగించి విధానాన్ని తెలియజేయడంతో పాటు రేడియేషన్‌ను గుర్తించడం, కొలవడం వంటి అనుభవాన్ని వాస్తవిక సెట్టింగ్‌లో తెలుసుకునే  అవకాశాన్ని పాల్గొన్నవారికి కల్పించింది” అని ఆయన అన్నారు.

సబ్బు, ఉప్పు వంటి రోజువారీ వినియోగ ఉత్పత్తులు బీటా రేడియేషన్‌ విడుదల చేయడానికి తగినంత సహజంగా సంభవించే K-40 రేడియో ఐసోటోప్‌లను కలిగి ఉన్నాయని పరికరాలు ఉపయోగించి బార్క్ శాస్త్రవేత్తలు పాల్గొన్నవారికి చూపారు. మనం పీల్చే గాలిలో రాడాన్ గ్యాస్ రూపంలో బీటా రేడియేషన్ కూడా ఉంటుందని తరగతి గది నుంచి గాలి నమూనాలు సేకరించి చూపారు

రేడియోధార్మికత, క్షయము, రేడియేషన్, గుర్తింపు, కొలత, అలాగే రసాయన, భౌతిక శాస్త్రాలు, వైద్యం, పరిశ్రమలు, వ్యవసాయం వంటి రంగాలలో రేడియో ఐసోటోప్‌ల ఉపయోగం, ప్రాథమిక విషయాలను బార్క్ నిపుణులు బోధించారు. కోబాల్ట్-60, కోబాల్ట్-67, థాలియం-204, పొటాషియం-40, సీసియం-137 వంటి రేడియో ఐసోటోప్స్ ఉపయోగించి ల్యాబ్ ప్రయోగాలు నిర్వహించారు.

NMR స్పెక్ట్రోస్కోపీపై అపార అనుభవం కలిగిన IAANCASకు చెందిన డాక్టర్ S కన్నన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అందిస్తున్న సహకారాన్ని తెలియజెప్పారు. పాలిమర్‌ల రంగంలో ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ వైకె భరద్వాజ్, పాలిమర్‌ టెక్నాలజీలో రేడియేషన్ ఉపయోగ విధానం గురించి మాట్లాడారు.

వైద్య వినియోగ వస్తువుల స్టెరిలైజేషన్, ఫ్యాబ్రికేటెడ్‌ వస్తువుల నాన్-డిస్ట్రక్టివ్ టెస్టింగ్, పండ్లు, కూరగాయల వంటి పాడైపోయే ఆహార పదార్థాల షెల్ఫ్ లైఫ్ పెంచడంలో రేడియేషన్‌ను విడుదల చేసే రేడియో ఐసోటోప్స్‌ బాగా ఉపయోగపడతాయి

No comments:

Post a Comment