Wednesday 29 December 2021

అను - ఆర్య లకు అవధుల్లేని మీ ప్రేమ ఎంత మధురమో తెలియచేయాలి అనుకుంటే… ఇదే మీకు జీ తెలుగు అందిస్తున్న సువర్ణ అవకాశం

మనమందరం రోజూ టెలివిజన్ చూస్తాం. ఎన్నో షోస్ అందులో ప్రసారమవుతుంటాయి. అందులో కొన్ని కథలు మాత్రమే మనసును హత్తుకుంటాయి. ఎందుకు? ఆ కథలు మనకు వినోదం పంచడమే కాకుండా మారుతున్న సమాజ స్థితిగతులను తెలుపుతాయి, మనల్ని మనకు తెలియకుండానే ఒక కొత్త దారిలో తీసుకువెళ్తాయి. అలాంటి కథలలో ఒకటే - 'ప్రేమ ఎంత మధురం'. ప్రేమ ప్రేమని మాత్రమే కోరుకుంటుంది. స్వచ్ఛమైన ప్రేమకు డబ్బు, కులం, మతం, ఆస్తులు, అంతస్తులు లాంటి పట్టింపులు ఉండవు. అలాగే స్వచ్చమైన ప్రేమకు వయస్సు కూడా అడ్డంకి కాదు. ఇదే కాన్సెప్ట్‌తో రూపొందించిన సీరియల్‌ ప్రేమ ఎంత మధురం ప్రతి సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 9 గంటలకు మీ జీ తెలుగు లో ప్రసారమవుతుంది.

సీరియల్స్‌ అన్నీ ఒకేలా ఉండవు. ప్రేమ ఎంత మధురం కూడా అలాంటిదే. ఈ సీరియల్‌ని అత్యుత్తమమైన ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌తో రూపొందించారు. ఈ సీరియల్‌ టైటిల్‌ సాంగ్‌ని కాశ్మీర్‌లోని పహల్గామ్‌ ప్రాంతంలో అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించారు. ఈ సీరియల్‌ టైటిల్‌ సాంగ్‌ ఇన్స్టంట్ హిట్‌ అయ్యింది. దీంతో... తొలిసారిగా ఒక సీరియల్‌ టైటిల్ సాంగ్ అభిమాన ప్రేక్షకుల కాలర్ ట్యూన్‌ గా మారింది. గత రెండేళ్లుగా తెలుగు ప్రజలు ప్రేమ ఎంత మధురం సీరియల్ ని ఎంతగానో ఆదరిస్తున్నారు. ఆ ప్రేమకు తలవంచి, ప్రేక్షకులకు బహుమానంగా సీరియల్ టైటిల్ సాంగ్ ను ఒక సరికొత్త రూపం లో రూపుదిద్దుతున్నారు.

కొత్తదనానికి మారుపేరు జీ తెలుగు. 2022 లో తన ప్రేక్షకులని అలరించడానికి, ఆర్య-అను లకి అభిమానులకి మధ్య ఒక వారధిగా మారబోతుంది. అవును, 'మధురమే ప్రేమ మధురమే' అని అందరి హృదయాలని గెలుచుకున్న ఈ పాటలో ఇప్పుడు అను- ఆర్య లు మాత్రమే కాకుండా మీరు, అనగా అభిమానులు కూడా కనిపించవచ్చు.

జీ తెలుగు వారు ప్రేమ ఎంత మధురం టైటిల్ సాంగ్ కాంటెస్ట్ ను జనవరి 1 నుండి జనవరి 16 వరకు నడుపనున్నారు. మీ స్థితిగతులు, కులం, మతం, లింగంతో పనిలేదు. ఒకవేళ మీరు మీ ప్రేమ కథను అందరికి చెప్పాలని అనుకుంటే, ప్రపంచం మీ కథని వినాలని అనుకుంటే, ఆర్యవర్ధన్ (వెంకట్ శ్రీరామ్) - అను (వర్ష హెచ్ కే) తో టైటిల్ సాంగ్ లో కనిపించాలని అనుకుంటే, ఈ క్రింద వివరాలతో మీ ప్రేమ ఎంత మధురమో తెలియచేయండి

1. http://Pem.zee5.com వెబ్ సైట్ లో లాగిన్ అవండి

2. మీ వివరాలు తెలపండి

అ. పేర్లు

ఆ. ఊరు

ఇ. మీ పెళ్లి జరిగి ఎన్ని నెలలు/ సంవత్సరాలు అయింది

ఈ. మీ ప్రేమ కథ ను ఒక పేరాగ్రాఫ్ లో తెలియచేయండి

ఉ. ఒరిజినల్ టైటిల్ సాంగ్ ను మీరు మీ భాగస్వామి తో కలిసి 30 సెకండ్ల వీడియో తయారు చేసి అప్లోడ్ చేయండి

ఊ. ఫోన్ నెంబర్

ఋ. అడ్రస్

ఈ వివరాలను ఆ వెబ్ సైట్ లో నింపండి. అను - ఆర్య లతో పాటు మీ కథను మధురముగా మార్చుకోండి.

మర్చిపోకండి ఈ అవకాశం జనవరి 1 నుండి జనవరి 16 వరకు మాత్రమే. ఇంకా ఎందుకు ఆలస్యం తొందరగా జీ తెలుగు వారి ప్రేమ ఎంత మధురం వెబ్ సైట్ లో లాగిన్ అవండి, టైటిల్ సాంగ్ లో కనిపించే అవకాశం గెలుచుకోండి.

No comments:

Post a Comment